Home » GHMC
హిమాయత్ సాగర్ 10 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో కుల్సుంపురా ప్రాంతంలోని మూసీ నది రోడ్డు వరదలకు గురైంది. వెంటనే అధికారులు రోడ్డును మూసివేసి వాహనాలను దారి మళ్లించారు.
హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్‌పేటలో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది.
మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని గ్రేటర్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రకటించారు. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నీకోలస్ తెలిపారు.
ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖలతో కర్ణన్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వ్యాపించిన కారణంగా మరికాసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
పారదర్శక సేవలు, పౌర సమస్యల పరిష్కారం, పాలనా వ్యవహారాల్లో సంస్కరణలకు అధునాతన సాంకేతికతను వినియోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పౌర సేవలు మొదలు ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్ పార్కింగ్, బస్సుల రియల్ టైం ట్రాకింగ్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ మోడల్స్, ప్రాజెక్టు టెండర్ మూల్యాంకనం, కీటక జనిత వ్యాధుల నివారణ, నిర్మాణరంగ వ్యర్థాల అక్రమ డంపింగ్ నియంత్రణను సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని భావిస్తోంది.
ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ నుంచి ఉదయం టిఫిన్ వడ్డించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.