Home » GHMC
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్‌గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో యంగ్ కలెక్టర్ ఆమ్రపాలి కాటాకు కీలక పదవి దక్కింది. ఆమెకు కొన్ని బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం.. చివరికి కీలక పదవిలోనే కూర్చోబెట్టింది..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-3గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
వర్షం కాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. జీహెచ్ఎంసీ పరిధిలోని.. తరచూ చెత్త వేసే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45, రోడ్ నం.70, గౌతంనగర్ బస్తీ, దీన్ దయాళ్ నగర్ బస్తీ, ఫిల్మ్ నగర్, పీఈటీ పార్క్ ప్రాంతాల్లో తరచూ చెత్త వేసే ప్రాంతాలు సైతం దాన కిషోర్ పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తుంటే.. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (Hyderabad Metropolitan Development Corporation)లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల గడిచి 15 రోజులైనా వేతనాలు అందలేదు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పురపాలన గాడితప్పింది. ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్న చెత్తకుప్పలు.. రోజుల తరబడి రోడ్లపై పారుతున్న మురుగు.. వెరసీ నగరంలో దోమల విజృంభణ.. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డుల పనితీరు అధ్వానంగా ఉందనడానికి నిదర్శనం.
అపార్ట్మెంట్లో డోర్ టు డోర్ తిరగకుండా ఒకేచోట డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తే చెత్త సేకరణ సులభతరమవుతుందని, అందుకోసం అపార్ట్మెంట్ అసోసియేషన్లను సంప్రదించి బిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో ఆస్తిపన్ను నగదు చెల్లింపులకు ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. ఇప్పటి వరకు ఆస్తిపన్నులను నగదురూపంలోనే ఎక్కువ మంది చెల్లించేవారు. కొద్దిమంది మాత్రమే ఆన్లైన్ ద్వారా ఆస్తిపన్నులను చెల్లింస్తున్నారు.
బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారా?
మెరుగైన పౌర సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, వనరుల నిర్వహణ కోసమే జీఐఎస్ సర్వే చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) తెలిపారు.