Home » Google
టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) కొత్త రౌండ్ ఫైనాన్సింగ్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఇ-కామర్స్ విక్రేత ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
గూగుల్ క్రోమ్(Google Chrome) వినియోగదారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్(CERT) టీమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వారి తాజా వల్నరబిలిటీ నోట్ CIVN-2024-0170 సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ అనేక లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది.
గూగుల్ పే(Google Pay) వినియోగదారులకు గుడ్ న్యూస్. షాపింగ్‌ను సులభతరం చేయడానికి గూగుల్ మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.“ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి” అనే ఫీచర్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది.
గూగుల్ జెమినీకి కొత్తగా ‘మెమరీ’ ఫీచర్ కలవనుంది. తద్వారా భవిష్యత్తు కాన్వర్సేషన్లను తెలియజేయగలుగుతుంది. అంటే యూజర్‌కు సంబంధించిన ఫ్యాక్ట్స్‌ను సేవ్ చేసి భవిష్యత్తులో గుర్తు చేయగలుగుతుంది
గూగుల్ మ్యాప్స్.. ఇది మనల్ని మన గమ్యస్థానాలకు వేగంగా చేర్చడంలో సహాయం చేయడమే కాదు, మిస్సింగ్ కేసులను ఛేధించడానికి కూడా ఉపయోగపడుతోంది. పోలీసులకు సాధ్యం కాని పనులను..
గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే యాప్ లేబుల్ ఫీచర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాప్‌ని(Apps) డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసే ముందు ఓ లేబుల్ వస్తుంది.
ఇటివల గూగుల్‌లో దాదాపు మొత్తం పైథాన్ టీమ్(Python team)ను తొలగించడం కలకలం రేగింది. కాస్ట్ కటింగ్ పేరుతో గూగుల్(Google) మొత్తం పైథాన్ టీమ్‌ను తీసేసింది. యునైటెడ్ స్టేట్స్ వెలుపల చౌకగా ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా పైథాన్ వ్యాపారాన్ని నిర్వహించాలని కంపెనీ ఆలోచిస్తోంది. అయితే ఈ అంశంపై తొలగించిన టీమ్‌కు నష్టపరిహారం ఇవ్వాలని గూగుల్ ఆలోచిస్తున్నట్లు తెలిపింది.
ఆల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సుందర్ పిచాయ్ ఏప్రిల్ 26తో కంపెనీలో 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిచాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు.
దిగ్గజ కంపెనీ గూగుల్ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్‌లో ఏదైనా ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెర్చ్ చెయ్యడానికి సర్కిల్ టు సెర్చ్ (Circle to search) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.
గూగుల్ నుంచి మరో ఫ్లాగ్షిప్ ఫోన్ బయటకు రానుంది. గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్‌ను గూగుల్ ఆవిష్కరించనుంది. మే 14వ తేదీన ఈ ఫోన్లను గూగుల్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం.