Home » GST
ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.
నగరంలో గత రెండు రోజుల నుంచి జీఎస్టీ అధికారులు(GST Officials) తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్(Tonic Liquor Groups)కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టానిక్ గ్రూప్స్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది.
పన్ను ఎగవేత సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పన్ను ఎగవేత సమస్య పరిష్కరించడంపై ఫోకస్ చేసింది. రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ అధికారుల ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సదస్సును సోమవారం (ఈ రోజు) ఢిల్లీలో నిర్వహించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సదస్సును ప్రారంభిస్తారని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆర్థిక సంవత్సరంలో జరిగే మార్పులు మార్చి నెల నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెలలో ఐదు కీలక మార్పులు జరగనున్నాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా అప్పుడప్పుడు ఆర్థికరమైన మార్పులు (Financial Changes) చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు ఈ ఏడాదిలో మార్చి 1వ తేదీ నుంచి కూడా కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి సాధారణ ప్రజల రోజువారీ కార్యకలాపాలపై.. అలాగే బ్యాంకులు, ఇతర వ్యాపారులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Andhrapradesh: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యారు. విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్లో శరత్‌పై కేసు నమోదు అయ్యింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
వస్తు సేవల పన్ను వసూళ్లు నవంబర్ మాసంలో 15 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.60 లక్షల కోట్ల మార్క్‌ను దాటి జీఎస్టీ వసూళ్లు రావడం ఇది ఆరోసారి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం తప్పుడు తడకలుగా సాగుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సేనలు ఆస్పత్రిపై బాంబులు వేస్తే ప్రధాని మోదీ సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీఎస్టీ కౌన్సిల్ (GST Council meet) 50వ మంగళవారం న్యూఢిల్లీలో ముగిసింది. ఆన్లైన్ గేమింగ్ (Online gaming) ముఖ విలువలో 28 శాతం ట్యాక్స్ విధింపునకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. హార్స్ రేసింగ్, క్యాసినోలకు ఇదే రేటు వర్తించనుంది. మరోవైపు క్యాన్సర్ సంబంధిత ఔషధాలు, అరుదైన వ్యాధులకు మెడిషిన్లు, ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో అవసరమయ్యే ఆహార ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది.
జీఎస్టీ వసూళ్లు (GST collections) రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ 2023 నెల జీఎస్టీ స్థూల ఆదాయం రికార్డ్ స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది.