Home » Gudlavalleru Engineering College
కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై పోలీసు బృందం దర్యాప్తు వివరాలను ఆయన ప్రకటించారు. కాలేజీలో పోలీసులు దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతోంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు బిగించి వీడియోలు చిత్రీకరించారని విద్యార్థులు భగ్గుమన్నారు. రెండ్రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. అయితే.. కాలేజీలో బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ శిరీష విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్థించారు. విద్యార్థులను ఒకింత బెదిరించినట్లు, బాధతో ఉన్న వారిపట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఇబ్బంది పెట్టారని ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి...
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌ల్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమేంటి? ఈ మొత్తం వ్యవహారం ఉన్న కోణాలేంటి..? ఇందులో సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? ఇంత జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.