Home » Gujarat
నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిన సమాచారం తెలియగానే ఆనంద్ పోలీసులు, బ్రిగేట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్చలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగను సైనికుల మధ్య జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు (గురువారం) గుజరాత్‌లోని కచ్ఛ్‌లో సర్ క్రీక్‌లోని లక్కీ నాలా వద్ద బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులతో గడిపారు.
వస్తు సేవల పన్ను(GST) మోసానికి సంబంధించిన కేసులో 'ది హిందూ' జర్నలిస్టు మహేశ్ లంగా బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు బుధవారం కొట్టేసింది.
భారతదేశంలో ఉన్న విస్తృత అవకాశాలపై ఇప్పుడు ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మనం అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుంటే పలు దేశాలు ఎంతో ఆతృతగా వింటున్నాయని చెప్పారు.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు చెందిన టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫెసిలిటీని గుజరాత్‌లోని వడోదరాలో ఏర్పాటు చేశారు. ఈ ఫెసిలిటీలో సైనిక విమానాల తయారీ కోసం ఉపయోగిస్తారు. మన దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్ (విమానాల విడి భాగాల అమరిక) ఇదే కావడం గమనార్హం. కీలకమైన ఈ ఫెసిలిటీని ప్రధాని మోదీ-స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఓ వ్యక్తి మోసాలకు పాల్పడేందుకు ఏకంగా కోర్టునే ఎంచుకున్నాడు. ఏకంగా నకిలీ కోర్టు సెట్టింగ్ వేశాడు. కేసులు విచారించడం, తీర్పులు ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. ఇలా చాలనే చేశాడు. అయితే కలెక్టర్ పరిధిలోని ఓ వివాదాస్పద భూమి విషయంలో అతడు ఇచ్చిన ఫేక్ ఆదేశాలు అతడిని పట్టించాయి. ఆసక్తికరమైన ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మెథాంఫెటమైన్ (MD), 427 కిలోల ఇతర డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పశువులను తప్పించే క్రమంలో బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాలపైకి బస్సు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
రాష్ట్రం నుంచి బాస్మతి ముసుగులో దొడ్డిదారిన దుబాయ్‌కి ఎగుమతి అవుతున్న పారాబాయిల్డ్ బియ్యాన్ని గుజరాత్ అధికారులు పట్టుకున్నారు.
బిల్కి్‌సబానో కేసులో ముద్దాయిలను ముందస్తుగా విడుదల చేయడాన్ని కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలను సమీక్షించాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది