Home » Gujarat
వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.
గుజరాత్‌లోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్ల(2002 Gujarat riots) సమయంలో బిల్కిస్ బానోపై(Bilkis Bano case) అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్, రాజుభాయ్ బాబులాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజస్థాన్ గిరిజన సమాజం కోరుతోంది. ఇందులో మెజార్టీ జిల్లాలను రాజస్థాన్ నుంచి అడుగుతోంది. రాజస్థాన్‌లో 33 జిల్లాలు ఉండగా 12 జిల్లాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రం కోసం ఆదివాసి పరివార్ సహా 35 గిరిజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.
కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ..
దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా గుజరాత్‌లోని ఓ సంఘటన నిలిచింది. ఓ ప్రైవేటు కంపెనీలో 10 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి పిలవగా 50 కాదు 100 కాదు ఏకంగా 1,800 మంది నిరుద్యోగులు క్యూ కట్టారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) తీవ్రంగా స్పందించింది.
ఆరంతస్తుల భవనం ఆకస్మాత్తుగా(Building Collapse) కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్(gujarat)లోని సూరత్(Surat)లో శనివారం మధ్యాహ్నం తర్వాత చోటుచేసుకుంది.
గుజరాత్ లో మరో ఉపద్రవం చోటుచేసుకుంది. సూరత్‌లోని సచిన్ పాలీ గ్రామంలో ఆరంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. సుమారు 15 మంది వరకూ ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
కాలం కలిసొచ్చినంత సేపు.. మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే కాలం కొద్దిగా కలిసి రాకుంటే.. ఎక్కడ పడాలో అక్కడే పడేటట్లు చేస్తుంది. అదే జరిగింది. రోహిత్ కనుబాయి సోలంకి విషయంలో. ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రమన్నట్లుగా కాకుండా.. చాలా రాష్ట్రాల్లో తన చోర కళను ప్రదర్శించాడు.
అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్ లోనూ బీజేపీని, నరేంద్ర మోదీని కలిసికట్టుగా ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రామమందిరం ఆధారంగా బీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని అయోధ్యలో ఇండియా కూటమి ఓడించిందని అహ్మదాబాద్‌లో శనివారంనాడు ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను శుక్రవారంనాడు పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ శనివారంనాడు అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. రాజ్‌కోట్, మార్బీ మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.