Home » Guntur
వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ జి.కరుణాసాగర్ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్యపోటీలు ఆదివారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రారంభమయ్యాయి.
ఆదాయ వనరులను అందిపుచ్చుకోవడం.. లేదంటే వాటి కోసం అన్వేషించడం పరిపాటి. ఆదాయ వనరులను పెంచుకుని తద్వారా అభివృద్ధి పనులకు నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత మున్సిపాల్టీలది. కానీ నరసరావుపేట మున్సిపాల్టీ మాత్రం ఉన్న ఆదాయ వనరులను గాలికి వదిలేసి ఆదాయాన్ని చేజార్చుకోవడంలో ముందున్నది.
బాపట్ల వ్యవసాయ కళాశాలలో 2024-2025 వ్యవసాయ విశ్వవిద్యాలయం వార్షిక 2వ దశ అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
పట్టణంలోని వసతి గృహాలను మున్సిపల్ కమిషనర్ జి.రఘునాధరెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు.
కాగా సినీ నటి, వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తాజాగా గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ చేసిన న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు.
పోలీసుశాఖలో నిఘా విభాగం విధులు కీలకమని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.
సూర్యలంక సముద్రతీరం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు.
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను పునఃపరిశీలన జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత డీఎస్సీ శిక్షణా శిబిరాన్ని శనివారం బావుడా చైర్మన్గా ఇటీవల నియమితులైన సలగల రాజశేఖరబాబుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.