Home » Guntur
గత ప్రభుత్వ ఆర్థిక పాపాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రావాల్సిన సొమ్మును కూడా జగన్ ప్రభుత్వం ఆరగించేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులపై టీడీపీ నేతలతో పాటు క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఆశావహులు వందల సంఖ్యలో ఉండడంతో పాటు సామాజిక కూర్పు కూడా క్లిష్టతరంగా మారడంతో నామినేటెడ్ పదవుల ప్రకటన విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.
రాష్ట్రంలో బీసీల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్ను సందర్శించి డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించారు.
విద్యార్థులకు ధృవీకరణపత్రాలు.. బర్త్, డెత్ సర్టిఫికెట్లు కావాల్సి వస్తే మీ సేవా కేంద్రాలు. ఓటరు కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, విద్యుత్ బిల్లులు కట్టాలన్నా మీ సేవా కేంద్రాలు.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి టీడీపీ హయాంలో చంద్రబాబు మీ సేవా కేంద్రాలను ప్రవేశపెట్టారు. ప్రజలకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించేలా వీటిని తీర్చిదిద్దారు.
లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే.. అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారే.. మంచికల్లు బుగ్గవాగు రిజర్వాయర్ ప్రాంగణం గాఢాంధకారంలో ఉంది.
భూముల రికార్డులను కంప్యూటరీకరించే సమయంలో జరిగిన పొరపాట్లు రైతుల మెడకు గుదిబండలా మారాయి.
తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణవార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు.
జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు, కృష్ణానది, సముద్ర తీర ప్రాంతాలు, గృహాలు దీపాల వెలుగులతో కాంతులీనాయి.
పల్నాటి వీరారాధన ఉత్సవాలకు కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం రాత్రి శ్రీకారం చుట్టారు. వీరాచారవంతులు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవఅయ్యవారిని ఊరేగింపుగా వీరుల దేవాలయానికి తీసుకొచ్చారు.