Home » Harish Rao
Telangana: ‘‘పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి’’
Telangana: తెలంగాణ పోలీసులకు హరీష్రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఏమైందో పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ తరహా పరిణామాలు ఎదుర్కోవటానికి పోలీసులు సిద్ధంగా ఉండాలంటూ మాజీ మంత్రి హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనా రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు.
వరద బాధితులందరికీ తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుపోయిందని గోబెల్స్ ప్రచారం చేశా రు. అలా అయితే.. మల్లన్నసాగర్లో ఈ రోజు 21 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి వచ్చింది?
మహాభారతంలో దుర్యోధనుడిలా సీఎం రేవంత్రెడ్డి ప్రవర్తన ఉందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు.
హామీలు అమలు చేయకుండ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో హరీశ్ ఓ పోస్ట్ చేశారు.
Telangana: రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. కేసీఆర్పై , ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా అని అడిగారు.
బీఆర్ఎస్ పాలనలో ఎంఎ్సఎంఈల అభివృద్ధి, కేసీఆర్ సాధించిన విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు.
మాజీ సీఎం కేసీఆర్ను తిట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొద్దు గడవం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.