Home » Harish Rao
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ అగ్ర నాయకుడు తన్నీరు హరీ్‌షరావు సోమవారం బహిరంగ లేఖ రాశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ‘‘మీ 9నెలల పాలనలో విద్యావ్యవస్థ పతనానికి చేరుకొంది. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది.
ఒకే అంశంపై ముఖ్యమంత్రి ఓ మాట, మంత్రులు మరో మాట్లాడుతుండడం చూస్తుంటే.. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ నడుపుతున్నారా? లేదా సర్కస్ నడుపుతున్నారా? అనే సందేహం కలుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘దూలం లెక్క పెరిగిన ఓ సన్నాసి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని నాకు సవాల్ విసిరాడు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నా ఎత్తు మీద ఎందుకు అసూయా?. నువ్వు లిల్లి పుట్ అంత ఉన్నవ్ అనలేనా?’’ అంటూ హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బినామీ పేర్లతో నిర్వహిస్తున్న డెయిరీల నుంచి వచ్చే నెయ్యిని యాదాద్రి, వేములవాడ దేవాలయాల్లో లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
‘‘ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించింది రేవంత్‌రెడ్డి, డీజీపీ కాదా?
పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
పార్టీ ఫిరాయింపుపై రచ్చ రచ్చ! ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం! ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పార్టీ మారిన మరో ‘బీఆర్ఎస్’ ఎమ్మెల్యే! అక్కడ హై టెన్షన్ వాతావరణం! ఆయన అరెస్టు.. విడుదల!
"నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం" ఇది అన్నది ఎవరో చోటామోటా నేత కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేనే. ఆయన ఎవరో కాదు తన్నీరు హరీశ్ రావు.
భాగ్యనగరం సాక్షిగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దమ్ముంటే కాస్కో అని ఒకరు అంటే.. తేల్చుకుందాం రా అని ఇంకొకరు అంటున్న పరిస్థితి. ఈ మాటల తూటాలతో ఇద్దరి వ్యక్తుల మధ్య నెలకొన్ని ఈ రచ్చ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవగా మారిపోయింది...