Home » Harish Rao
తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందన్నారు.
ఒక్క గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని చెబుతున్న మాజీ మంత్రి హరీష్‌రావు(Former Minister Harish Rao), తన భూములపై విచారణ జరపాలని సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు లేఖ రాసి తన నిజాయితీని నిరూపించుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన న్యాయవాదులు జెల్ల రవీందర్ యాదవ్, కుంచం అశోక్ యాదవ్, రమేష్ పోతరాజు డిమాండ్ చేశారు.
రైతులను దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు పండగ పేరిట విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు.
‘‘తెలంగాణకు చెందిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వెనక్కు ఇవ్వాలని నిర్ణయించావ్.. మరి దావోస్‌లో ఆయనతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందం మాటేంటి రేవంత్‌రెడ్డీ?’’ అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
తెలంగాణ రైతాంగానికి రేవంత్‌రెడ్డి ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులను అన్ని విధాలా మోసం చేసిన ప్రభుత్వం విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తుందో చెప్పాలని నిలదీశారు.
తెలంగాణలో ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇక్కడ పథకాలు అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3వేలు ఇస్తామనడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పత్తి, మిర్చి, ధాన్యం రైతుకు గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
కాళేశ్వరం విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును తప్పనిసరిగా విచారణకు పిలిపించాలని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరుపుతున్న కమిషన్ భావిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.