Home » Harish Rao
కాళేశ్వరం విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును తప్పనిసరిగా విచారణకు పిలిపించాలని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరుపుతున్న కమిషన్ భావిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.
రంగనాయక్ సాగర్ దగ్గర హరీశ్‌రావు ఇరిగేషన్ భూములు ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుందని, అందుకే వరంగల్ సభలో మాజీ సీఎం పేరును 50 సార్లు ప్రస్తావించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు వచ్చేది అయితే ఒట్లు.. లేదంటే తిట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం కురుమూర్తి స్వామి ..
ఆరు గ్యారంటీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డకౌట్ అయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో నిర్వహించిన క్రికెట్ ట్రోఫిలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మద్దతు ధర దక్కక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పత్తి రైతులతోపాటు కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇరు ప్రభుత్వాలు తక్షణం పరిష్కారం చూపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచే ప్రజా వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదల భూములను అన్యాయంగా లాక్కోవాలని ప్రయత్నించినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరుగుబాటు తప్పదని పేర్కొన్నారు.
రైతుల వద్ద కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సర్కారు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.