Home » Harish Rao
మహారాష్ట్ర ఎన్నికల సభలకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
Telangana: ‘‘సోయి తెచ్చుకో రేవంత్ రెడ్డి.. దేవుడి మీద ఒట్టు వేసినవ్.. రుణమాఫీ చెయ్యి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్ చేశారు. సన్నాలకే బోనస్ అంటూ సన్నాయి రాగాలు తీయవద్దన్నారు. వానకాలంలో రైతు భరోసా ఇవ్వలేదని... కనీసం యాసంగికి అయినా ఇస్తావా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవే లేదన్నారు.
లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు.
తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు.
Telangana: గరీబీ హటావో అని ఇందిరా గాంధీ గారు పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నారు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడిందన్నారు.
Telangana: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు విమర్శించారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందంటూ మహారాష్ట్ర ప్రజలను సైతం మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
‘‘మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపే ఎక్కువగా ఉంది. సినిమాలకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు.. సీఎం రేవంత్ బూతులు వింటుంటే రాజకీయాల్లో కూడా నేతల ప్రసంగాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Telangana: పాలనను వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు పక్క రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవన్నారు. బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ భూమి ఉన్నంతకాలం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.