Home » Haryana
హర్యానాలో తమ ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపట్టడంపై అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపణ తెలిపారు. ఈవీఎంలను తప్పుపట్టడం చాలా సులభమని, ఈవీఎంల వల్ల మీరు నెగ్గినప్పుడు మాట్లాడరని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పు పడుతుంటారని అన్నారు.
బీజేపీకి మరింత బలం చేకూరుస్తూ స్వతంత్ర ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేష్ జూన్‌లు బుధవారంనాడు బీజేపీలో చేరారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా గనౌర్ నుంచి కడ్యాన్ పోటీ చేసి గెలుపొందగా, బహదూర్గఢ్ నుంచి బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి రాజేష్ జూన్ గెలిచారు.
భూపేంద్రసింగ్ హుడా, కుమారి షెల్జా మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం అభ్యర్థి రేసులో ఉన్నానంటూ షెల్జా చేసిన ప్రకటన హుడా వర్గానికి కోపం తెప్పించింది. హుడా మాత్రం అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మోదీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై హర్యానా సీఎం నయబ్ సింగ్ సైనీ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురుకావడం, బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు.
కేకే సంస్థ అంచనాలు తప్పాయి. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్, దైనిక్ భాస్కర్, పీపుల్ పల్స్, మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్, పీ మార్క్, సీ ఓటర్ సంస్థల అంచనాలు తప్పాయి. అసలు సర్వే సంస్థల అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై భిన్నభిప్రాయాలు..
ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువమంది 500, వెయ్యి ఓట్ల మెజార్టీలోపు గెలిచారని, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్ల చీలికతోనే ఫలితాలు తారుమారయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మెజార్టీ తక్కువ ఉన్న కారణంగానే సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. కానీ ఎన్నికల సంఘం తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత ..
భారతీయ జనతా పార్టీతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎందుకని గట్టి పోటీనివ్వకపోతోంది? బీజేపీని ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలు కాంగ్రెస్ వద్ద లేవా? 2022లో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ...
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది! ప్రీ పోల్, పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. రాజకీయ నిపుణుల విశ్లేషణలను అబద్ధం చేస్తూ.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది!
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ జోరు కనిపించగానే.. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం పెద్ద ఎత్తున జలేబీలు (జిలేబీ) తెప్పించి పంచిపెట్టింది!