Home » Heavy Rains
నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది...
తుంగభద్ర(Tungabhadra)కు వరద పోటెత్తుతోంది. జలాశయంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. డ్యాం 19వ క్రస్ట్ గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోయి అన్నదాత ఆవేదన పడిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంలో మళ్లీ జలకళ ఉప్పొంగుతోంది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా రాజధాని నగరం చెన్నై(CHENNAI) నుంచి వెళ్లాల్సిన 18 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దుచేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డా.ఎంజీఆర్ సెంట్రల్, ఎగ్మూర్, తాంబరం రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే సోమవారం ప్రకటించింది.
నగరంలోని రోడ్లపై రాళ్లుండొద్దని, గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్(Danakishore) ఆదేశించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకంలో భాగంగా చేపట్టి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు.
Andhrapradesh: భారీ వర్షాలకు విజయవాడ వాసులు వణికిపోయారు. కుండపోత వర్షాలతో సింగ్‌నగర్‌లోని బుడమేరు మహోగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులుగా ప్రజలు బుడమేరు ముంపులోనే ఉండిపోయారు. అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆహారం, మంచినీటిని పడవల ద్వారా బాధితులకు అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో సింగ్‌నగర్‌కు రానున్నారు.
రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 173 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది..
కుండబోత వర్షం.. ఫలితంగా ముంచెత్తిన వరద హోరు తగ్గాయి! అయితే అవి మిగిల్చిన విధ్వంసం.. ఇళ్లలో నిత్యావసరాలు సహా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన బడుగు జీవుల్లో నిండిన విషాదం ఎప్పుడు పోతుందనేది మాత్రం తెలియదు! ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి..
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
వరద సహాయచర్యలను వరుసగా రెండోరోజూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకున్నారు.