Home » Heavy Rains
జిల్లాలో ఎప్పుడో 85 ఏళ్ల క్రితం మున్నేరు వద్ద 35అడుగుల మేర ప్రవహించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మళ్లీ ఇప్పుడు 35అడుగులు మున్నేరు నీటి మట్టం దాటిందని చెప్పారు. మున్నేరు ప్రళయం దాటికి వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు.
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు పడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(సోమవారం) ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో ఆ యా శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సోమవారం అమరావతిలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
Telangana: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అగ్నిమాపక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఫైర్ డీజీ నాగిరెడ్డి (Fire DG Nagireddy) తెలిపారు. సోమవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రెండువేల మందికి పైగా రెస్క్యూ ఆపరేషన్తో రక్షించామన్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం) సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.
Andhrapradesh: వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్లతో పశువులకు వైద్యం అందించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందించనున్నారు.
Andhrapradesh: ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Andhrapradesh: ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు.