Home » Heavy Rains
Telangana: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.నిన్న రాత్రి వరకు 877 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి 570 బస్సులను రద్దు చేశారు.
Telangana: చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా నిలిచాయి లా పలోమా విల్లాస్. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నారు. రోడ్లపై వర్షపు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ‘‘La Paloma Villas’’లోకి వరద నీరు వచ్చి చేరింది.
Telangana: తెలంగాణలో భారీ వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచుతూ కీలక ప్రకటన చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే (Heavy Rains). ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల థాటికి అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు ఏకమై పొంగిపొర్లి.. గ్రామాలు, కాలనీల్లోని లోతట్లు ప్రాంతాలను ముంచెత్తాయి...
Telangana: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కామాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా... మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు...
Andhrapradesh: ఏపీలో భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వరద సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం నుంచి వరద సహాయక చర్యలు కోసం నిధులు డ్రా చేసేందుకు ట్రెజరీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
భారీ వర్షాలకు బెజవాడ వణికిపోయింది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన జనాలు ఎంతో మంది ఉంటే.. నీళ్లు, అన్నం పెట్టి కాపాడంటూ మహాప్రభో అంటూ ఇళ్లలో ఇరుక్కుపోయిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో టిఫిన్లు, భోజనాలు లేక వరద బాధితులు అల్లాడుతున్నారు. విషయం తెలుసుకుని చలించిపోయిన సీఎం నారా చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి..
Telangana: భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మహబూబాబాద్ ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షాల ప్రభావం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.