Home » Heavy Rains
భారీ వర్షాలు పడినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) నగరవాసులను కోరారు. పిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి రాకుండా కుటుంబసభ్యులు చూసుకోవాలన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు.. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్లు , ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో ఫేమస్ అయిన కుమారి అంటీ రూ. 50 వేల విరాళం ఇవాళ(సోమవారం) అందజేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు కుమారి ఆంటీ చెక్కు అందచేశారు.
దేశవ్యాప్తంగా నేటితోపాటు వచ్చే మూడురోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏయే ప్రాంతాల్లో వానలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఉరుము తీవ్రమే.. మెరుపూ తీవ్రమే! ఈ రెండింటినీ తలదన్నేలా వాన!! ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా భారీగా కురిస్తే వాన మొదలైన క్షణాల్లో వరద పోటెత్తింది.
భాగ్యనగరంలో భారీ వర్షం పడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. లనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోగా, జనజీవనం స్తంభించిపోయిందని తెలిపారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని చెప్పారు
ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
భాగ్యనగరంలో వర్షం పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.