Home » Hero Vijay
ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో కోయంబత్తూరు సూలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోయంబత్తూరు సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్(Auto driver)ను నియమించారు.
పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న పరందూరు సహా 13 గ్రామాల రైతులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరినో సంతృప్తి పరిచేందుకు విమానాశ్రయ ప్రాజెక్టు అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ‘తమిళగ వెట్రి కళగం’ నేత, నటుడు విజయ్(Actor Vijay) ధ్వజమెత్తారు.
ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని హీరో విజయ్(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారికంగా వెల్లడించింది. ఇదే విషయంపై శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Actor Vijay) ప్రకటన విడుదల చేశారు.
ప్రజలను నమ్మించి మోసం చేయడమే పాలకుల ప్రధాన లక్ష్యంగా కనబడుతోందని, అందుకు నీట్ రద్దు హామీ ప్రకటన చక్కటి ఉదాహరణ అని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్(Actor Vijay) డీఎంకే ప్రభుత్వంపై తన ఎక్స్ పేజీలో ధ్వజమెత్తారు.
హీరో విజయ్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో డీఎంకే కూటమికి ఎలాంటి నష్టం లేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో అభిప్రాయపడ్డారు.
తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడుకు స్థలమిచ్చిన రైతులను శనివారం ఉదయం ఆ పార్టీ నేత, నటుడు విజయ్(Vijay) ఘనంగా సత్కరించారు. అదే సమయంలో అందరికీ ప్రత్యేక విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఇప్పటివరకు పొత్తు గురించి చర్చించలేదని, పొత్తుపై వస్తున్న వదంతులు నమ్మరాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్(Former AIADMK Minister D. Jayakumar) పేర్కొన్నారు.
ప్రముఖ సినీనటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే)కు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తోందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్(State Intelligence) విభాగం ఆరా తీ స్తోంది. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల విక్రవాండిలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడుకు ఐదు లక్షలమందికిపైగా జనసమీకరణ ఎలా సాధ్యమైందనే విషయమై ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు రాబడుతున్నారు.
ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) బలోపేతానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది.
విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు.