Home » High Court
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని పిటిషనర్ నవీన్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ భారతీయ జనతా పార్టీ నేత ఉమా ఆనందన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. టీవీకే నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటషన్లపై ఆదేశాలను జస్టిస్ సెంథిల్ కుమార్ రిజర్వ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీఓ ఇవ్వడం సరికాదని చెప్పింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది.
టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అక్టోబర్ 9 వరకు ఇదే ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG (They Call Him OG) సినిమాకు సంబంధించి టికెట్ రేట్లపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో OG మూవీ యూనిట్‌కు తాత్కాలిక ఊరట లభించింది.
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పవన్ కల్యాణ్ 'OG' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది. 'OG' సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ..
సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో లోకల్ అభ్యర్థి గుర్తింపు వివాదాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లా విద్యార్థి శశికిరణ్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.