Home » High Court
ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైకోర్టులో శనివారం ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో ఏ-2గా ఉన్న దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావుకు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
సమీపంలో ఉన్న మున్సిపాల్టీల్లో గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు సమర్థించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనలపై నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
ఏటూరునాగరం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు ఈగోలపు మల్లయ్య మృతదేహాన్ని ఆయన భార్య అయిలమ్మ, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయరాదని.. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టంచేసింది.
ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీసే రాజకీయ దురుద్దేశం, కుట్రపూరితంగా తనపై కేసులు పెడుతున్నారని.. పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో ఈ నెల 1న తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
పొంగల్ నగదు బహుమతి బ్యాంక్ ఖాతాల్లో జమచేయవచ్చని హైకోర్టు మదురై బెంచ్ సూచించింది. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన విమనాథన్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్(High Court Madurai Division Bench)లో దాఖలుచేసిన పిటిషన్లో... రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు అందించే పొంగల్ సరుకుల గిఫ్ట్ ప్యాక్‌లో చక్కెరకు బదులుగా కిలో బెల్లం ఇవ్వాలని, పొంగల్ బహుమతిగా ఇస్తున్న రూ.1,000 నగదు కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు మదురై బెంచ్‌లో గత ఏడాది పిటిషన్ వేశారు.
ప్రపంచంలోని పలు ప్రాంతా ల్లో సంభవిస్తున్న విపత్తులకు ప్రకృతిని తప్పుపట్టలేమని, ఆందుకు మనమే కారణమని మద్రాసు హైకోర్టు(Madras High Court) అభిప్రాయం వ్యక్తం చేసింది. ఊటీ, కొడైకెనాల్(Ooty, Kodaikanal) తదితర కొండ ప్రాంతాల్లో వినియోగించి విసిరేస్తున్న ప్లాస్టిక్ వస్తువుల నిషేధం కేసులో హైకోర్టు న్యాయమూర్తులు ఈ మేరకు పేర్కొన్నారు.