Home » High Court
ప్రభుత్వం ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులనూ ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
న్యాయ సంస్కరణలను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... నేరం- శిక్ష విషయంలో హేతుబద్ధత లోపించిన తీర్పులను పునఃసమీక్షించాలని యోచిస్తోంది..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు.. స్పీకర్ ఎదుట విచారణకు రాకముందే హైకోర్టు సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవడం చెల్లదని రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు.
స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది.
ఓటుకు నోటు కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ తప్పుకొన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తనను తప్పించాలని, తాను నిర్దోషినని పేర్కొంటూ జెరూసలేం మత్తయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా... గతంలోనే న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
చిన్నతనంలో పెట్టిన పేర్లు ఆధునికంగా లేవని భావించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మార్చుకున్న వారికి హైకోర్టులో ఊరట లభించింది. మార్చిన పేర్లతో కొత్తగా ధ్రువ పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టనుంది.
బీఆర్‌ఎ్‌సకు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మొహమ్మద్ రహీల్ అమీర్ అలియాస్ రహీల్ (22)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.
రాష్ట్రంలో కులగణన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రత్యేక కమిషన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు తీర్పుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
వస్తు సేవల పన్ను(GST) మోసానికి సంబంధించిన కేసులో 'ది హిందూ' జర్నలిస్టు మహేశ్ లంగా బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు బుధవారం కొట్టేసింది.