Home » Himachal Pradesh
ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
కుంభవృష్టి కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో గల్లంతైన హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు చెందిన 45 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షాలతో వరద పోట్తెత్తింది. ఆ క్రమంలో సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్‌లో సమేజ్ ఖాడ్ వద్దనున్న హైడ్రో ప్రాజెక్ట్ సమీపంలో ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో ఒకరు మృతి చెందగా.. 32 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కాశ్యప్ వెల్లడించారు.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం మేఘ విస్పోటంతో వచ్చిన ఆకస్మిక వరదలతో ఒక పాదచారుల వంతెన, మూడు తాత్కాలిక షెడ్లు కొట్టుకుపోయాయి. కులు జిల్లా తోష్‌నాలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.
వీధుల్లో ఎవరైనా గొడవ పడుతుంటే జనాలు ఏం చేస్తారు? కొందరైతే సినిమా చూస్తున్నట్లు అలాగే చూస్తూ ఉండిపోతారు, మరికొందరేమో ఆ గొడవని ఆపేందుకు ప్రయత్నిస్తారు.
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు బుధవారం.. మండి బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్(Kangana Ranaut)కు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు.
రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ ఒక సీటు కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా దేహరా నియోజకవర్గం నుంచి 9,399 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
తనను కలవాలంటే ఆధార్ కార్డుతో రావాలంటూ నియోజకవర్గ ప్రజలకు మండీ ఎండీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ నిబంధన విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. కంగనా తీరు సరికాదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో ఆయన రెండు కెబినెట్లలలో పని చేసిన వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. అందులో పలువురు కీలక నేతలున్నారు.