Home » Hindupur
రాజ్యసభలో అంబేడ్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మంత్రి పదవితోపాటు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ డిమాండ్ చేశారు.
మహిళా సర్పంచకే అత్తింటి వేధింపులు తప్పలేదు. భర్త మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను అత్తమామలు, వారి పిల్లలు వేధించసాగారు. ఇంట్లోకి రావద్దంటూ బయటకు పంపారు.
మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు.
పావగడ, తుమకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలించి పోలీసులకు సవాలుగా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పావగడ పోలీసులు అరెస్టు చేశారు.
అధికారం లేకపోయినా వైసీపీలో విభేదాలు మాత్రం సమసిపోలేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూపురంలో ఎలా వ్యవహరించారో ప్రస్తుతం కూడా ఆ పార్టీ నాయకులు అలాగే ఉన్నారు. నియోజకవర్గంలో విభేదాల నేపథ్యంలో ఆదివారం హిందూపురానికి పులమతికి చెందిన నేత సతీ్షరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ వచ్చారు.
ఈనెల 13న కళాశాలలో నిర్వహించిన పరీక్షల్లో వెనుక ఉన్న విద్యార్థి ప్రేమ్సాయి పేపరులోకి తొంగి చూసినట్లు తెలుస్తోంది. తన పేపరులో ఎందుకు చూస్తున్నావని ప్రేమ్ సాయి ప్రశ్నించగా మాటామాటా పెరిగింది.
సహ విద్యార్థుల దాడిలో గాయపడిన విద్యార్థి ప్రేమ్సాయి మృతి చెందాడు. దీంతో బాధ్యులను కఠినంగా శిక్షించి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం టీటీడీ బోర్డు కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మనతోపాటు 23 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు.
‘నవ్విపోదురుగాక.. నాకేటి’ అన్నట్లుంది మాజీ మంత్రి. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ తీరు. వైసీపీ అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా. ఆమె ఇంకా మంత్రి అనే భ్రమల్లోనే ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి చిన్న విషయానికీ, సొంత పార్టీ నాయకులదే తప్పు ఉన్నా..
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లపై గుంతలకు మట్టి కూడా వేయలేకపోయిందనీ, కూటమి ప్రభుత్వం నెలల వ్యవధిలోనే కొత్త రోడ్లు వేస్తోందనీ అభివృద్ధి అంటే ఇదీ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవిత.. వైసీపీ నాయకులు చురకలు అంటించారు.