Home » Hyderabad CP
Telangana: గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా త్వరగా గణేష్ నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు ఉన్నతాధికారులతో ఈరోజు(ఆదివారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న జరిగే గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన 36మంది సైబర్ క్రిమినల్స్‌ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా గుజరాత్లో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
నగరంలో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డ్రగ్స్, చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ చోరీలు, దొంగతనాలు సహా పలు నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా రాజేంద్రనగర్‌లో ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
ఇటీవల పదోన్నతులు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎల్బీస్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) పి.విశ్వప్రసాద్(Additional CP (Traffic) P. Vishwaprasad) తెలిపారు.
Telangana: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్‌పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్‌పై అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం 27 కేసులు నమోదు చేసినట్లు తెలపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసామని... వారు కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, లాప్టాప్స్ సీజ్ చేశామన్నారు.
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని సపష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
శ్రీరామనవమి శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సీపీ.. నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మంగళ్‌హాట్‌లో అన్ని ప్రభుత్వ విభాగాల కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు.
Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఆనాటి పోలీసు ఉన్నతధికారులు అరెస్ట్ అవగా.. వారి రిమాండ్ రిపోర్ట్‌లో అనేక కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా విచారణ కొనసాగుతోందన్నారు.