Home » Hyderabad Metro Rail
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు మార్గం సుగమమైంది. రెండో దశ నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. ఈ రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.
. మిట్టా ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు (ఆదివారం) ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో పాలీ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తొలిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపీ, టెలీమెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ సౌకర్యాలు మెట్రో స్టేషన్లో ఉంటాయని వెల్లడించారు.
నగర మెట్రోస్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్(Free parking) సదుపాయం పునరుద్ధరించాలంటూ ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్(Nagole Metro Station) వద్ద ప్రయాణికులు మహాధర్నాకు దిగనున్నారు. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో ప్రయాణికులు ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు చూసి అవాక్కయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్లో ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర జీతాలతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా అదనంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణం అని మండిపడ్డారు
గ్రేటర్ హైదరాబాద్‌లో మైట్రో రైలు (Metro Rail) సేవలకు కొంతసేపటి వరకు అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. మెట్రో రైల్లో సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్లో మెట్రో రైల్ నిలిచిపోయింది.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..
ఉగాది పండుగ (Ugadi festival) వేళ మెట్రో ట్రైన్ (Metro Train) ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది. మెట్రోలో ప్రయాణికులకు అందిస్తున్న వివిధ రాయితీలు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ రాయితీలను పొడిగిస్తున్నట్లు మెట్రో యజమాన్యం ప్రకటించింది.
భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro) సంస్థ. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను(Discount) రద్దు చేశారు మెట్రో రైల్ అధికారులు. రూ. 59 హాలిడే కార్డును(Metro Holiday Card) కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు(Summer) కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది.
భాగ్యనగర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మార్గంలో మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.