Home » Hyderabad News
ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్‌సెట్ కౌన్సెలింగ్ తేదీలు మారాయి. ఈ మేరకు తాజాగా అధికారులు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు.
విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖపై పవర్ కమిషన్ చీఫ్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. పవర్ కమిషన్‌కు కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపై విచారణ మొదలుపెట్టిన జస్టిస్ నరసింహా రెడ్డి.. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించారు.
హైదరాబాద్: భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 64 కేజీల గంజాయి పట్టుకుని సీజ్ చేసామని, ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం డీసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
మాజీ మిస్ వైజాగ్ ఘటన మరవక ముందే హైదరాబాదులో అచ్చం అలాంటి ఘటనే రిపీట్ అయ్యింది. నగరంలోని అంబర్పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ సీసీఎస్(CCS) ఇన్స్పెక్టర్ సుధాకర్(Inspector Sudhakar) ఏసీబీ(ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్, జూన్ 13: నగరంలోని మోషే పబ్బులో అన్నీ మోసాలే వెలుగు చూస్తున్నాయి. తాజాగా విచారణలో పబ్బు అక్రమాలు బయటపడుతున్నాయి. పబ్బు యాజమాన్యంతో చేతులు కలిపిన ఓ యువతి.. ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తల్ని చీట్ చేసింది. వ్యాపారవేత్తలని ట్రాప్ చేసి మోషే పబ్‌కు తీసుకువచ్చిన యువతి..
బల్దియా పరిధిలో భారీ అవినీతి బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 200 కోట్ల స్కామ్ బట్టబయలైంది. అవును, ఈ అవినీతి అంతా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు నిర్ధారించారు అధికారులు. జీహెచ్ఎంసీలో లేని కార్మికులకు రూ. 200 కోట్ల వేతనాలు చెల్లించారు అధికారులు. గత పదేళ్లుగా ఇదేతంతు జరిగిందని..
ఫిట్నెస్, అనుమతి పత్రాలు లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బుధవారం విద్యార్థులను స్కూళ్లకు చేరవేస్తున్న బస్సులను ఆపి విస్తృత స్థాయిలో తనిఖీ చేశారు. పదుల సంఖ్యలో బస్సు లు ఫిట్‌గా లేవని, ఇంకొన్నింటికి అనుమతి లేదని, మరికొన్నింటిని పన్ను చెల్లించకుండా తిప్పుతున్నారని గుర్తించారు.
ప్రత్యేకంగా యువతులను నియమించుకొని.. వారి ఫొటోలతో డేటింగ్ యాప్‌లలో ఖాతాలు సృష్టించి టెకీలను లక్ష్యంగా చేసుకొని వలపు వల విసరడం ద్వారా లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా దోపిడీకి ఢిల్లీ, బెంగళూరులో పబ్‌ల నిర్వాహకులు సాయం చేయడం విశేషం.
మీడియా ఐకాన్ రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందించారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. ఫిల్మ్ సిటీ సందర్శించాలని రామోజీ రావు తనను ఒకసారి ఆహ్వానించారని గుర్తుచేశారు.