Home » Hyderabad News
నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను భారీగా పట్టుకున్నారు. హోటళ్లలో శుభ్రంగా లేని ఆహారాన్ని ప్రజలకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నాణ్యతగా లేని ఆహార పదార్థాలను చూసి పలు హోటళ్లకు వార్నింగ్ ఇచ్చారు.
నగరంలోని పలుచోట్ల ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
సుచిత్రలో నెలకొన్న భూవివాదంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. భూమి విషయంలో తన వద్ద ఉన్నవి తప్పుడు డాక్యూమెంట్స్ అని కాంగ్రెస్ నేతలు(Congress Leaders) ఆరోపించడంపై తీవ్రంగా స్పందించారు. తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు మల్లారెడ్డి. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్(MLA Laxman) సిద్ధమా? అని ప్రశ్నించారు.
వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్‌శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్ పరిధిలో అరగంట విద్యుత్(Power Supply Off) బంద్ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్సీ(లైన్ క్లియరెన్స్) ఇచ్చేందుకు విద్యుత్‌శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కనిపించిన ప్రతి వస్తువును నకిలీగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్ వస్తువులను నకిలీవి తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొంతమంది నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
వాహనాలను దొంగిలించటం చూస్తుంటాం.. అది రొటీన్ అనుకున్నాడేమో ఓ ఆకతాయి ఏకంగా ఎమ్మెల్యే కారు నంబర్ ప్లేట్‌నే కొట్టేశాడు. ఇంకేంటి ఆ నంబర్ ప్లేట్‌ను తన వాహనానికి తగిలించి చలాన్లు ఎగ్గొడుతూ కేటుగాడు దర్జాగా తిరుగుతున్నాడు. ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పి ఎన్ని రోజులు ఉంటాడు..? అడ్డంగా బుక్ అయ్యాడు.
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్, గుజరాత్ మధ్య ఈ రోజు కీలక మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే.
Election Commission of India: హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Parliament Constituency) పరిధిలోని బహదూర్‌పురా పోలింగ్ స్టేషన్లో(Bahadurpura Polling Station) రిగ్గింగ్(Election Rigging) జరిగిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోపై ..
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.