Home » Hyderabad News
ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రముఖులకు వలపువల విసిరి న్యూడ్ కాల్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న ఓ చీటర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడి.. ప్రముఖులకు వల విసిరేవాడని పోలీసులు వెల్లడించారు.
‘గణేశ్ మహరాజ్ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్య లో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు.
సోదరుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలనుకున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కెనడాలో జరిగింది.
మందుబాబులకు బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వైన్స్ బంద్ చెయ్యాలని సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.
లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నవారికి అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. అధికారులను ఆదేశించారు.
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్(Hyderabad)లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు.
నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ సారి కంబోడియా కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించాలని పోలీసులు నిర్ణయించారు.