Home » Hyderabad
ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువ ధరకే ఇళ్లు ఇస్తామని పలువురిని మోసం చేసిన ఇద్దరిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లికి చెందిన చక్క భాస్కర్, అతడి భార్య సుధాణి చైర్మన్, ఎండీలుగా ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో సంస్థను స్థాపించారు.
ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం ఎందుకు? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.
అదానీ ముడుపుల వ్యవహారంలో వైఎస్ జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తెలిపారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశం లేదన్నారు.
పుష్ప మూవీ మేకర్స్‌పై సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పుష్ప-2 మూవీ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మరొకరికి అప్పగించడంపై ఫైరయ్యారు. మూవీ ప్రమోషన్ వేదికపై దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు చర్చకు దారితీశాయి.
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం కానుంది. నేడు 14మంది ఇంజినీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. విచారణలో భాగంగా 14మంది ఇంజినీర్లను కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.
హైదరాబాద్ మహానగరానికి గతంలో నగర శివారుల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉండేవి. కానీ నేడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. అంటే.. నగరంలో అవి అంతర్భాగమయ్యాయి. అలాగే మహానగరం రోజు రోజుకు విస్తరిస్తుంది.
వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచి, అందించాలని ప్రభుత్వాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవల చదవకుండా చనిపోతే గొప్ప కళానుభవం కోల్పోయినట్టేనని తెలుగు వర్సిటీ వీసీ నిత్యానంద రావు చెప్పారు. తెలుగు వారంతా ఇప్పటికీ తప్పకుండా చదవాల్సిన నవల వేయిపడగలేనన్నారు.
అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో ఆమె సమావేశమయ్యా రు.
‘‘జిల్లా స్థాయి కోర్టు వరకు తెలుగును వాడుక భాషగా ప్రవేశపెడితే.. మనుగడలోకి వస్తుంది. జాతీయ న్యాయ కళాశాలల్లోని విద్యార్థులకు తెలుగు నేర్చుకోవాలని, జిల్లా కోర్టులో తెలుగులో వాదించాలని చెబుతున్నాం.