Home » Hyderabad
సమాజానికి ధర్మబద్ధమైన విజ్ఞానం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆరెస్సెస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భారతదేశంలో ధర్మం విజ్ఞానభరితమైందని, మరి విజ్ఞానం ధర్మసమ్మతమా, కాదా అని ఆలోచించాలని సూచించారు.
రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కీలకమైన భూ దస్త్రాలు అనేకం శిథిలమయ్యాయి. ఇంకా ఆ దశకు చేరుకోనివి శిథిలమయ్యే ప్రక్రియలో ఉన్నాయి. సంరక్షించాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు.
సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఆన్లైన్లో వివరాల నమోదు చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏ పొరపాట్లకు అవకాశం లేకుండా వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అల్లావుద్దీన్ అద్భుత దీపంలా రాష్ట్రం మారాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం యువతను గంజాయి మత్తులో దించి సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు.. పక్కా ప్రణాళికతో దానిని నగరాలకు సరఫరా చేరుస్తున్నారు.
డ్రగ్స్ కేసులకు సంబంధించి ఈ ఏడాది 82 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయి. వీరంతా ఈ ఏడాది జనవరి నుంచి నమోదైన 39 కేసుల్లో నిందితులు. నిందితులకు గరిష్ఠంగా 20 ఏళ్లు, కనిష్ఠంగా ఆర్నెల్ల చొప్పున జైలు శిక్షలు పడ్డట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది.
నగరంలోని కృష్ణకాంత్ పార్కు ప్రాంతంలో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఒక యూనిట్‌ను జాతికి అంకితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 237 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు సమీపంలో రూ.826 కోట్ల భారీ ప్రాజెక్టుకు సైతం శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతున్నారు.