Home » HYDRA
జయభేరీ కన్స్ట్రక్షన్స్కు హైడ్రా (HYDRAA) నోటీసులు.. గత 24 గంటలుగా ఎటు చూసినా ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ!. ఎన్ కన్వెన్షన్ తర్వాత జే కన్స్ట్రక్షన్ (Jayabheri Constructions) వంతు వచ్చేసింది..! ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.. 15 రోజుల్లో నేల మట్టం అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై మురళీమోహన్ తొలిసారి స్పందించారు..
ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా(HYDRA) ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అమీన్ పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తు్నారు.
హైడ్రా.. నాన్ స్టాప్‌గా దూసుకెళ్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరిగెడుతోంది.. ఎప్పుడొచ్చి బుల్డోజర్ ఇళ్లపై పడుతుందో అని కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా..
భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.
వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న హైడ్రా సూచనలతో కేసు ఎదుర్కొంటున్న బాచుపల్లి తహసీల్దారు పూల్‌సింగ్‌కు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది.
Telangana: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్డీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలు చేసిన బిల్డర్లను బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఎంపీగా చూస్తూ ఊరుకోవాలా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఆయన సరూర్‌నగర్ చెరువును బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు.
హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించినా.. అక్రమ వసూళ్లకు పాల్పడినా జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.
వానను, వరదను తమలో ఇముడ్చుకొని.. భూగర్భ జలాలను పెంచే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు.