Home » HYDRA
హైడ్రాకు ప్రత్యేక చట్టం కల్పించారు. మున్సిపల్ చట్టంలో 374 - బీ సెక్షన్ చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్‌ను రాజ్ భవన్‌కు పంపింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
Telangana: మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జంట జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కాసేపటి క్రితమే జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. మరికాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు.
హైడ్రాతో నష్టపోయిన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం విస్తృత అధికారాలు కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలో ప్రత్యేక సెక్షన్‌ను చేరుస్తున్నారు.
మూసీ నదీగర్భం (రివర్బెడ్)లో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ మూడో రోజు కూడా నిలిచిపోయింది.
మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్టీఎల్ను నిర్ధారించిన తర్వాతే.. చర్యలు చేపట్టాలని సూచించింది.
మూసీకి ఇరువైపులా చేసిన సర్వే, మార్కింగ్‌తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితులను తరలించడం లేదని, నది సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చేపడుతున్నదని పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేయిస్తుందన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ గూడలో పర్యటించిన కేటీఆర్.. బాధితుల దగ్గరకు స్వయంగా వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.
మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కారు నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.