Home » India vs England Test Series
కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకి ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డ్ నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో.. టీ20, వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్‌గా బుమ్రా చరిత్రపుటలకెక్కాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. అయితే విశాఖ టెస్ట్ మ్యాచ్ ఓటమి అనంతరం ఇంగ్లండ్ టీమ్ ఇండియా నుంచి దుబాయ్ వెళ్లనుంది. ఈ మేరకు ఆ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది.
తన సంచలన బౌలింగ్‌తో 90 ఏళ్ల నాటి రికార్డును బుమ్రా బద్దలుగొట్టాడు. 1934లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ అమర్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా ర్యాంక్ మెరుగుపడింది. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (104) శతక్కొట్టడంతో పాటు అక్షర్ పటేల్ (45) మెరుగ్గా రాణించడం వల్లే.. టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు.
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 253 పరుగులకే ప్రత్యర్థి టీమ్ చాపచుట్టేసింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 143 పరుగుల ఆధిక్యం సాధించింది. ముఖ్యంగా.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.
హైదరాబాద్ టెస్ట్‌లో ఊహించని విధంగా టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. భారత బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం వల్లే ఈ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 420 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్‌కు 230 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా విజయలక్ష్యం 231 పరుగులుగా ఉంది.