Home » India vs Pakistan
ఈ ప్రపంచకప్‌లోనే అతి పెద్ద మ్యాచ్ అయిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ సాధికారికంగా ఆడుతోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై ఓల్టేజ్ గేమ్.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ సిరాజ్ మియా సత్తా చాటాడు. తన సహజ శైలికి అనుగుణంగా పవర్ ప్లేలోనే వికెట్ తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను 8వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు.
క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు.
ఒకటి కాదు.. రెండు కాదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌తో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో భారతే గెలిచింది. రెండు జట్లు 7 సార్లు తలపడితే 7 సార్లు భారత్‌నే విజయం వరించింది. ప్రతిసారి పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది.
మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభంకానుంది. దీంతో మ్యాచ్ క దీంతో మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్ల గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే టీమిండియాకు సంపూర్ణ అధిపత్యం ఉంది.
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్ష 30 వేల మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ ప్రారంభంకానుంది.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది.
వరల్డ్‌కప్ ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించలేదని నిరాశలో ఉన్న అభిమానులకు గుడ్ న్యూస్. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 14న జరగనున్న కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోందట.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సోకిన డెంగ్యూ జ్వరం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఆరోగ్యం విషమించడంతో గిల్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
వన్డే ప్రపంచకప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు ఖాళీ సమయాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అభిమానులు చూపిస్తున్న అభిమానానికి పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిదా అవుతున్నారు.