Home » Insurance
ప్రజల నమ్మకం, ఆదరణ తోనే జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) 68 ఏళ్లుగా విశేష సేవలందిస్తూ ముం దుకు సాగుతుందని సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె.సంధ్యారాణి అన్నారు. మోరంపూడి జంక్షన్ వద్ద గల ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం వారోత్సవాలను ప్రారంభించి సంస్థ పతాకాన్ని ఆవిష్క రించి మాట్లాడారు.
ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఆగస్టు 14, 2024) చివరి తేదీగా నిర్ణయించబడింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) యువత కోసం నాలుగు కొత్త బీమా పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల పేర్లు యువ టర్మ్, డిజి టర్మ్, యువ క్రెడిట్ లైఫ్, డిజి క్రెడిట్ లైఫ్. ఈ పథకాలు ఆగస్టు 5, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని, తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.
మీరు తక్కువ పెట్టుబడి(investment) పెట్టడం ద్వారా పెద్ద మొత్తాలు రావాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. అందుకోసం LIC జీవన్ ప్రగతి ప్లాన్(lic jeevan pragati plan) బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీంలో 12 ఏళ్లలోపు పిల్లల నుంచి 45 ఏళ్లలోపు వ్యక్తులు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో భద్రత కోసం లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఏమైనా జరిగినా.. లేదంటే పొదుపు కోసం కూడా ఎక్కువ మంది బీమా తీసుకుంటారు. సాధారణంగా బీమా తీసుకునేటప్పుడు ముందు, వెనుక ఆలోచించకుండా కొంతమంది తొందరపడి ఇన్సూరెన్స్ తీసుకుంటారు.
ఆరోగ్య బీమా పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీమా నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారుల నుంచి క్లెయిమ్ అభ్యర్థనను స్వీకరించిన గంటలోపు బీమా కంపెనీలు నగదు రహిత చికిత్సను అనుమతించాలని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఓ చోట రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి వద్ద ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులకు అందజేసే ప్రమాద క్లెయిమ్‌లు(Mishap Claims) సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయంలో స్పష్టత కోరుతూ ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ జైన్ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు సంస్థ హ్యాండిచ్చింది. దీంతో, తిక్కరేగిన బాధితురాలు వెంటనే సంస్థ తీరును నెట్టింట ఎండగట్టింది.
బ్రిటన్‌లో కొంతకాలం క్రితం జరిగిన ఓ రియలెస్టే్ట్ మోసం మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.