Home » International News
బెబింకా తుఫాను చైనాను బెంబేలెత్తిస్తోంది. సోమవారం ఉదయం భారీ టైఫూన్ (తుఫాను) గంటకు 151 కిలోమీటర్ల వేగంతో షాంఘైను తాకడంతో ఈ ఆర్థిక నగరం అతలాకుతలమైంది.
బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.
బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియాలో హింస చెలరేగింది. అల్లర్లు, విధ్వంసాలు, కాల్పులతో అట్టుడికింది. భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు అప్పగించి ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేంతగా పరిస్థితి దిగజారింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిలో ట్రంప్‌నకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఈ ఘటనపై స్పందించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న క్రమంలో అక్కడ కాల్పులు జరిగాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఆఫ్రికా ఖండంలో ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తున్న ఎంపాక్స్ వ్యాధి నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మొట్టమొదటిసారిగా ఓ టీకాకు అనుమతినిచ్చింది.
టెస్లా చీఫ్ ఈలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది! ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో, అనుభవజ్ఞులైన వ్యోమగాములు మాత్రమే చేసిన స్పేస్ వాక్‌ను...
ఇటీవలే విడుదలైన 'ది కాందహార్ హైజాక్' టెలివిజన్ సిరీస్ గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జైశంకర్‌ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
చైనా తన దూకుడు చర్యల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. 7 చైనా నౌకాదళ నౌకలు, ఒక అధికారిక నౌక, 17 సైనిక విమానాలు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తనను తాను దైవ కుమారుడిగా, ఈ విశ్వానికి యజమానిగా ప్రకటించుకుని.. లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి.. చిన్నపిల్లల సెక్స్ రాకెటింగ్ సహా రకరకాల అరాచకాలకు పాల్పడిన ఫిలిప్సీన్స్ పాస్టర్ అపోలో క్విబొలోయ్‌ని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది!