Home » IPL 2025
భారత క్రికెటర్ జీవితం రోజుల వ్యవధిలో ఊహించని విధంగా మారిపోయింది. ఒక్క సీజన్ వ్యవధిలోనే రూ.55 లక్షల నుంచి రూ.13 కోట్లకి పెరిగింది.
Glenn Maxwell: ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు.
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. వేలం జరిగే వేదిక, తేదీతో పాటు ఇతర వివరాలపై అప్డేట్ వచ్చేసింది.
Shreyas Iyer: ఐపీఎల్-2025 రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో మెగాఆక్షన్ మీద ఇప్పుడు అందరి ఫోకస్ షిప్ట్ అయింది. వేలం బరిలో ఎందరు స్టార్లు ఉన్నా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మీదే అందరి గురి ఉంది. ముఖ్యంగా కేకేఆర్‌ను విన్నర్‌గా నిలిపిన అయ్యర్ ఎంత ధర పలుకుతాడనేది ఆసక్తికరంగా మారింది.
Rishabh Pant: ఐపీఎల్-2025కు సంబంధించి ఇప్పటికే రిటెన్షన్ ముగిసింది. దీంతో తదుపరి జరిగే వేలం మీదే అందరి ఆసక్తి నెలకొంది. ఆక్షన్‌లో చాలా మంది స్టార్లు పాల్గొంటున్నా చిచ్చరపిడుగు రిషబ్ పంత్ మీదే అందరి ఫోకస్ ఉంది. అతడు ఈసారి వేలం రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.
2021 నుంచి టీమ్‌తోనే కొనసాగిన తనను రిటెయిన్ చేసుకోకపోవడంపై కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగానికి గురయ్యాడు.
గడువు తేదీ సమీపించడంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ తమ రిటెన్షన్ జాబితాను వెల్లడించాడు. వాటన్నింటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తీసుకున్న నిర్ణయమే చాలా మందికి షాక్ కలిగించింది. గతేడాది ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా టీమ్ వదిలేసుకుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
ఐపీఎల్ రిటెన్షన్ గురించి కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మళ్లీ తనను తీసుకోవడంపై ఉద్వేగానికి గురయ్యాడు. వచ్చే మూడేళ్లలో కచ్చితంగా జట్టుకు కప్పు అందిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. బెంగళూర్ అభిమానులు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు.
ఎల్ఎస్జీ ఆఫర్ చేసిన టాప్ రిటెన్షన్ ఆఫర్‌ను కేఎల్ రాహుల్ వదలుకున్నట్టు తెలుస్తోంది. అతను తన వ్యక్తిగత కారణాల వల్ల లక్నో జట్టుకు నో చెప్పాడని సమాచారం.
ఐపీఎల్ జట్లు తాము రిటైన్ చేసిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్‌ను సంప్రదించలేదని తెలుస్తోంది.