Home » IPL
ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్కే జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కెప్టెన్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని కేఎల్ వెల్లడించాడు. సరైన ప్రదర్శన చేయకపోతే యజమానులు బోలెడు ప్రశ్నలు వేస్తారని తెలిపాడు.
ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను హెడ్ కోచ్‌గా నియమిస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ వైదొలగడంతో.. సంగక్కర ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాదలే మాట్లాడాడు. సంజూ కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్ 2026కి సంబంధించిన మినీ వేలంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 16న అబుదాబిలో ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా విదేశాల్లో వేలం వేయడం ఇది మూడో ఏడాది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్, రిలీజ్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీల పర్సుల్లో ఎంత డబ్బు ఉంది.. ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకుందాం.
ట్రేడ్ డీల్ ద్వారా సీఎస్కే జట్టు జడేజాను వదులుకొని సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నై జట్టు తదుపరి కెప్టెన్ సంజూనే అని వస్తున్న వార్తలపై సీఎస్కే క్లారిటీ ఇచ్చింది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియకు నేడే ఆఖరి గడువు. దీంతో ఫ్రాంచైజీలు ఎవరిని రిలీజ్, రిటైన్ చేస్తున్నాయనే దాని గురించి లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి.
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కే జట్టు జడేజాను వదిలి సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడటంపై సంజూ శాంసన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదిలి సంజూ శాంసన్‌ను ట్రేడ్‌లో సొంతం చేసుకుంది. ఈ నిర్ణయం తమకు కఠినమైనదని, కానీ తప్పలేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.