Home » Israel
‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్ 100 ఫైటర్ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!
ఇరాన్‌లోని టెహ్రాన్, ఇలాం, కుజెస్థాన్‌లో ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్ తయారీ, ప్రయోగ కేంద్రాలపై శనివారం తెల్లవారుజామున చేసిన దాడిలో లక్ష్యాలన్నీ పూర్తి చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది.
ఇజ్రాయెల్‌పై గత అక్టోబర్ 1న బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు జరిపింది. దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని సుమారు20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు విడిచింది.
గాజాలో హమాస్--ఇజ్రాయెల్ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.
లెబనాన్ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడికి ప్రణాళికలు బహిర్గతమయ్యాయి. పెంటగాన్ నుంచి రెండు కీలక పత్రాలు బయటకు వచ్చాయి.
ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్(ISIS) చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట. అనంతరం ఆ కూరను అక్కడ బందీలుగా ఉన్న వారికి వడ్డించేవారట.
ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు.
హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.