Home » Israel
ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఒకవైపు! వాటి రాకను అల్లంత దూరంలోనే పసిగట్టి అప్రమత్తమైన ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ యారో పంపిన ఇంటర్‌సెప్టార్లు మరోవైపు!! ఒకదాన్నోకటి ఢీకొనడంతో భారీ శబ్దాలు.. పేలుళ్లు!!
ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్‌పైకి దూసుకెళ్తున్నాయి.. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో దాడులు జరుపుతున్నాయి.. మనకు కొన్ని వేల కి.మీ.ల దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నా.. మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పశ్చిమాసియాతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణం. చమురు దిగుమతులు, పలు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఆ వీడియో క్లిప్‌లకు క్యాప్షన్ ఇచ్చి ఉంది. నెతన్యాహు పరుగు తీయడం వీడియోలో కనిపించింది.
పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించింది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ బలగాలు క్షేత్రస్థాయి దాడులకు దిగిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సన్నద్ధమవుతోందని వైట్ హౌస్ అధికారి ఒకరు హెచ్చరించారు.
హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ సేనలు.. సోమవారం అర్ధరాత్రి దాటాక లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. సోమవారం ఉదయం నుంచే అమెరికా వార్తా సంస్థలు సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ తమ వెబ్ ఎడిషన్లలో భూతల దాడులకు సర్వం
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బంకర్ అత్యంత దుర్బేధ్యమైనది. పైన ఆరు అంతస్తుల భవనం ఉండగా.. భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్ ఉంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్(Israel) భీకర వైమానిక దాడులు జరిపింది. తాజా దాడిలో 100 మందికి పైగా మరణించారు.350 మందికి పైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
రామాయణంలో కబంధుడనే ఒక రాక్షసుడి పాత్ర ఉంటుంది! శాపం కారణంగా తల కాళ్లు లేని రాక్షస రూపం దాల్చిన ఓ గంధర్వుడు కబంధుడు. కానీ.. అతడి హస్తాలు ఎంతదూరమైనా సాగుతాయి. వాటితో రకరకాల జంతువుల్ని పట్టుకుని తింటుంటాడు.
లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మరో గట్టి దెబ్బ తగిలింది. గడిచిన మూడ్రోజులుగా.. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా సహా.. కీలక నాయకులు హతమవ్వగా.. ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో మరో కీలక నేత నబీల్ కౌక్ హతమయ్యాడు.