Home » Israel
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారని, 124 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
"నన్ను ప్రత్యర్థులు ఏ క్షణమైన చంపేస్తారని భయమేస్తోంది" ఇది అక్షరాల ఓ దేశానికి చెందిన యువరాజు వ్యాఖ్యలు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా చట్ట సభ సభ్యులతో ఇలా గోడు వెల్లబోసుకున్నారు.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా కమాండర్ హత్యలు ఇజ్రాయెల్ పనేనని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల హిజ్బుల్లా గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే.
హమాస్ అధినే ఇస్మాయిల్ హినియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన నాటి నుంచి తూర్పు ఆసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్‌సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
గాజా తూర్పు ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఓ పాఠశాల భవనంలో ఉన్న పాలస్తీనీయులపై దాడికి తెగబడ్డాయి. దాంతో వంద మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రార్థనలు చేసే సమయంలో దాడి జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత వారం కూడా గాజాలో గల నాలుగు పాఠశాలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా.. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది! ఇజ్రాయెల్‌కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా..
మొస్సాద్..! ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన నిఘా, స్పెషల్ ఆపరేషన్ల సంస్థ..! ఈ సంస్థ ఒక ఆపరేషన్‌ను ఎంచుకుంటే.. శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది.