Home » Jagan Cases
పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో గత జగన్ ప్రభుత్వం అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి తన రోత పత్రిక ‘సాక్షి’కి రూ.వందల కోట్లు దోచిపెట్టారు.
‘ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన గుంటూరు మిర్చి యార్డులోకి వైసీపీ ప్రభుత్వ హయాంలో సంబంధం లేని వ్యక్తులు చొరబడ్డారు. అడుగడుగునా అవినీతికి పాల్పడి వ్యవస్థని కుప్పకూల్చారు’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
కాకినాడ పోర్టు యజమాని కేవీ రావును బెదిరించి రూ.మూడు వేల కోట్ల విలువైన వాటాలు లాక్కున్న నాటి సీఎం జగన్ టీమ్ వ్యవహారంలో సీఐడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఈ దందా మూలాలపై లోతుగా దృష్టి సారించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ప్రైవేట్ కంప్లయింట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ బంధువులకు పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.
ఆస్తులు లాక్కోవడం జగన్ సర్కారుకు అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్ అయితే..
ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టును అనాథను చేశారని తేటతెల్లమైంది. ఆయన నిర్వాకం కారణంగానే కాఫర్ డ్యాంల్లో సీపేజీ ఎగదన్నుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020, 2021 వరదల కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని..
అరాచకమే హద్దుగా చెలరేగిపోయిన వైసీపీ తన ఐదేళ్ల పాలనలో చేయని దౌర్జన్యాలు లేవు. దేనిపైనైనా అప్పటి సీఎం జగన్ కన్ను పడితే చాలు.. బెదిరించడం.. అడిగింది ఇవ్వనంటే కేసుల బూచితో దారికి తెచ్చుకోవడం.
రేషన్ బియ్యం లోడైన కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకను సీజ్ చేయడం అసాధ్యమేనని అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నౌక సీజ్ కోసం కేసుపెట్టినా అడ్మిరాలిటీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై అప్పటి సీఎం స్థానంలో ఉన్న జగన్ పలు ఆరోపణలు చేశారని, అవన్నీ నిరాధారమని పిటిషనర్ పేర్కొన్నారు.