Home » Jagan Cases
జగన్ జమానాలో జరిగిన వ్యవస్థల విధ్వంసంలో జిల్లాల పునర్విభజన ఒకటి. జగన్ సర్కారు పోయినా ఆయన చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు.
‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం దిగిపోవడంతో ‘జే ట్యాక్స్’ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్‌కు, మద్యం ధరలకు సంబంధం ఏంటంటే... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు.
అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
ఒక్క చాన్స్ పేరుతో ఐదేళ్లు రాష్ర్టాన్ని పాలించిన జగన్ రాయలసీమకు చేసిందేమీ లేదని, చివరకు ఆయన రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు.
విద్యార్థులకు ఫీజుల చెల్లింపు విషయంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎలాంటి అబద్ధాలు చెప్పారో, ఇప్పుడు కూడా అచ్చం అవే చెబుతున్నారు. తన హయాంలో ఫీజులు పెండింగ్ పెట్టిన విషయాన్ని అంగీకరించకుండా మొత్తం ఇచ్చేసినట్లుగా కలరింగ్ ఇస్తున్నారు.
సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి నాటి సీఎం జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ వెల్లడించారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్‌ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పోర్టులు అదానీకి సమర్పయామి! ప్రాజెక్టులూ అదానీకే అప్పగింత! చివరికి... సోలార్ పవర్ కూడా అదానీదే! జగన్ జమానాలో అదానీదే రాజ్యం! ఇప్పుడు వీరిద్దరి అక్రమ బంధాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బయటపెట్టాయి.