Home » Jagan
విజయవాడ: టీడీఆర్ బాండ్ల కంభకోణంలో జగన్ను అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు.
జగన్ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం సరఫరా దారులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఎగ్స్ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రూ.112 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.66 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెట్టింది.
‘పాల్వాయిగేటు వంటి సెన్సిటివ్ పోలింగ్ బూత్లో ఒకేఒక హోంగార్డును పెట్టి నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశా రు.
విద్యా కానుకను కావాల్సిన వారికి కట్టబెట్టడం వెనుక విద్యా శాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హస్తం ఉందన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఆయన ఒత్తిడితోనే అప్పట్లో అధికారులు టెండర్లకు మంగళం పాడేశారు.
జగన్ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి ఆస్కారమున్న ప్రతిచోటా కోట్లకు కోట్లు దోచేశారు.
‘నా క్టైంట్ దొంగతనాలు చేశాడు. అయితే ఉరి శిక్ష వేస్తారా? దోపిడీలు చేశాడు... అయితే ఉరి శిక్ష వేస్తారా? బాంబులు కూడా వేశాడు. అయితే, ఉరి శిక్ష వేసేస్తారా?’... అదేదో సినిమాలో కమెడియన్ లాయర్ తన క్లైంటునే ఇలా కోర్టులో ఇరికించేస్తాడు.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్పై సొంత క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమనే చర్చ నడుస్తోంది.
ప.గో.జిల్లా: పింఛన్ తీసుకోవడానికి వచ్చి మండుటెండలు తట్టుకోలేక మరణించిన 34 మంది వృద్ధుల మృతికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని, వృద్ధుల మరణానికి కారణమైన జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
Andhrapradesh: జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తింది. సర్వర్లో సాంకేతిక లోపంతో పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది. సర్వర్ లోపంపై అధికారులు ఆరా తీస్తున్నారు. టెక్నికల్ విభాగంలో ఇంకా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే ఇదంతా మానవ తప్పిదమా... లేక సాంకేతిక లోపమా అన్న అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.