Home » Jagan
రాంగోపాల్ వర్మకు దమ్ముంటే.. ధైర్యంగా నిలబడాలని.. అప్పుడు చేసింది కరెక్టు అని చెప్పాలని.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమండ్ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నారని.. జగన్‌కు సిగ్గు ఉందా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ సినిమాల గురించి మాట్లాడతారా.. అంటూమండిపడ్డారు.
కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.
‘ఆంధ్రప్రదేశ్‌కు అదానీ మూడు సార్లు వచ్చి విద్యుత్ ఒప్పందం చేసుకుని వెళితే అప్పటి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలీదా? అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడా లేదంటోన్న జగన్ వ్యాఖ్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలను పెంచి... ట్రూ అప్, ఇంధన సర్దుబాటు పేర్లతో ప్రజలను బాదేసినందుకు సన్మానం చేయాలా? అని మాజీ సీఎం జగన్‌ను విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు.
జగన్ జమానాలో జరిగిన వ్యవస్థల విధ్వంసంలో జిల్లాల పునర్విభజన ఒకటి. జగన్ సర్కారు పోయినా ఆయన చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో గద్దెనెక్కిన జగన్.. ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా మద్యాన్ని కమీషన్లకు కేంద్రంగా వాడుకున్నారు. ఎక్కడా వసూళ్లు అనే పదం కనిపించకుండా
రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఆన్లైన్ కోర్సులు ఉచితంగా అందిస్తామంటూ గత ప్రభుత్వంలో ఓ కంపెనీకి దాదాపు రూ.50 కోట్లు ధారపోశారు. దీనిపై అప్పటి సీఎం జగన్ నోటి నుంచి మాట రావడం ఆలస్యం ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై కదిలారు. టెండర్లు, చర్చలు ఏమీ లేకుండా నేరుగా ఎడెక్స్ అనే కంపెనీతో అడ్డగోలు ఒప్పం
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. మంగళవార జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు.