Home » Jagan
‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు.
తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ పారిపోయే అవకాశాలున్నాయని, ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్, అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఘ మేఘాలపై విద్యుత్‌పై కుదిరిన అనుబంధం.. ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకు వచ్చింది.
మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఐదేళ్లు ఆయన అధికారంలో ఉండడంతో ఈ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టి ఉంటుందనేది... ఇతర జిల్లా వాసులు భావన..! కానీ.. సొంత జిల్లా అభివృద్ధికి జగన్ చేసింది అంతంతమాత్రమే.
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు.. శాసనసభకు వచ్చి మాట్లాడొచ్చని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు.
రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లను మార్చేయడం... మద్యం విధానం... ఇసుక పాలసీ... స్మార్ట్ మీటర్ల టెండర్లు... బైజూస్ ట్యాబ్‌లు... తాజాగా ‘సెకీ’తో ఒప్పందం పేరిట అదానీ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు! అన్నీ వివాదాస్పదమే... అన్నింటా ‘ఆర్థిక’ ఆరోపణలే!
మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుదుత్పత్తి చేసి నిల్వ చేసే ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా గత జగన్ సర్కార్ అదానీ పవర్ సంస్థలకు కట్టబెట్టింది.
పోలవరం ప్రధాన డ్యాం ఎత్తును తొలి దశలో 41.15 మీటర్లకు ప్రతిపాదించింది నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వమేనని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ, జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. సోమవారం తక్షణ విచారణ కోరుతూ పిటిషనర్ విశాల్ తివారీ మెన్షన్ చేయనున్నారు.