Home » Jagan
వైఎస్ జగన్ వీరాభిమాని, ఆ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిడుతూ.. తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనను నమ్మి మోసపోయానని, వ్యాపారంలో నష్టపోయి రోడ్డు పాలయ్యానని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్ను బయట ఉంచి తప్పు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్త అన్నారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసేవారికి కఠిన శిక్షలు పడతాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం వచ్చిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.
మాజీ సీఎం జగన్ పదవిలో ఉన్నంత కాలం రాజధాని అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి నష్టం చేయడానికి ఎన్నికల ముందు వరకూ శాయశక్తులా ప్రయత్నించారు. అమరావతిపై కక్షతోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి జగన్ తీవ్ర విముఖత ప్రదర్శించారు.
జగన్ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీ సులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ దాడితో సంబంధం ఉన్న నలుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.
‘పదవిలో ఉన్నా పేదల కో సం పనిచేయలేకపోతున్నా.
రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కష్టపడి పారిశ్రామిక, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ కంపెనీలను తీసుకొచ్చిందని... కానీ, జగన్ వచ్చాక ఆ కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ-పీఏసీ) ఎన్నిక రసవత్తరంగా మారింది. తగినంత బలం లేకపోయినా ఈ కమిటీలో సభ్యత్వం కోసం వైసీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
వైసీపీ హయాంలో నాటి సీఎం జగన పర్యటనలకు కాన్వాయ్ ఏర్పాటు చేసిన వాహనదారులు అద్దె బిల్లుల కోసం కళ్లకు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. సీఎం కాన్వాయ్తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు వాహనాలను సమకూర్చారు. వాహనాల అద్దెతోపాటు డ్రైవర్ బత్తా సొమ్ము రాలేదు. కొవిడ్ సమయంలో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి, మృతదేహాలను తరలించడానికి పలువురు వాహనాలను సమకూర్చారు. నాలుగేళ్లు గడిచినా వారికి బిల్లులు చెల్లించలేదు....
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠానికి విచ్చేశారు.