Home » Jagdeep Dhankar
రాజ్యసభ చైర్పర్సన్ జగ్దీప్ ధన్ఖడ్ - సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య పార్లమెంట్లో శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది.
ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్య వాడివేడి సంభాషణ జరిగిన రెండ్రోజులకే వారి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ అన్నారు. తన కుమారుడి మరణం కంటే ఎక్కవ బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ( Jagdeep Dhankhar ) ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ ( Hyderabad ) లో పర్యటించ నున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతకుమారి ( CS Shanthakumari ) అధికారులతో రివ్యూ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ను వ్యంగ్యంగా అనుకరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈ ఘటనపై వివాదం రేగడంపై వివరణ ఇచ్చారు. తన చర్య వెనుక ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం లేదని అన్నారు. ధన్ఖడ్ తనకంటే సీనియర్ అని, లాయర్లుగా తాము ఒకే ప్రొఫెషన్లో కొనసాగామని చెప్పారు.
పార్లమెంటు చరిత్రలోనే 144 మంది ఎంపీలపై ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడటంతో విపక్ష ఎంపీలు మంగళవారంనాడు నిరసనకు దిగారు. కొత్త పార్లమెంటు భవనం మకర్ ద్వార్ వెలుపల మెట్లపై 'మాక్ పార్లమెంటు' నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మరో అడుగు ముందుకు వేసి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్పర్సన్ జగ్దీప్ ధన్ఖడ్ ను అనుకరిస్తూ 'పేరడీ' చేశారు. దీనిని రాహుల్ షూట్ చేశారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి భవన్కు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ నెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన సంకేతాలను పంపించారు.
ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రివిలేజ్ కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించేంత వరకూ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ శుక్రవారంనాడు ప్రకటించారు.